Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉండాలి: కలెక్టర్​

Collector Nizamabad | పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉండాలి: కలెక్టర్​

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణా రెడ్డి అధికారులను అదేశించారు. కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో బుధవారం విద్యాశాఖ పనితీరుపై ఒక్కో మండలం వారీగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టాయిలెట్స్, నీటి వసతి (water supply), విద్యుత్ సదుపాయం ప్రతి బడిలో అందుబాటులో ఉండాలన్నారు. బాలబాలికలకు (boys and girls) ప్రత్యేకంగా టాయిలెట్స్ లేనిచోట వెంటనే నిర్మాణాలు జరిపించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా చేయాలని, విద్యార్థుల ఆధార్​ను ఎన్​రోల్​ చేయించి యూడైస్ పోర్టల్​లో (UDIS portal) తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలన్నారు. అలాగే, అన్ని యాజమాన్యాలు ఆధార్, అపార్ జెనరేట్ చేసేలా పర్యవేక్షించాలన్నారు. అపార్ జెనరేట్ చేయని పాఠశాలలకు నోటీసులు జారీ చేసి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

Collector Nizamabad | జిల్లావ్యాప్తంగా సివిల్​ వర్క్స్..​

ఎక్కడైనా సివిల్ వర్క్స్ పనులు పెండింగ్​లో ఉంటే వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు. బడుల్లో మధ్యాహ్న భోజనం (mid-day meals) అమలు తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. సరుకులు, కూరగాయల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు.

ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ, నాణ్యమైన విద్యను బోధించేలా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలన్నారు. భవిత కేంద్రాల నిర్వహణ, వయోజన విద్య అమలు తీరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఎంఈవోలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, అన్ని మండలాల ఎంఈవోలు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.