అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) అన్నారు.
నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలానికి చెందిన 65 మంది లబ్ధిదారులకు చెక్కుల ద్వారా ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు (government welfare schemes) అర్హులకు తప్పనిసరిగా అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.
ఏ నియోజకవర్గంలో ఇవ్వనంతగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ.10 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను (CMRF cheques) లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు సైతం అర్హులందరికీ అందిస్తామని.. బిల్లులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం సక్రమంగా నిర్వహించి ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. బిల్లును సకాలంలో వచ్చేలా నమోదు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
