అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఇటీవల వాయిదాపడ్డ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ శనివారం వివరాలు వెల్లడించారు.
తెయూ పరిధిలో ఈనెల 28, 29, 30 తేదీల్లో జరగాల్సిన పీజీ పరీక్షలు (PG exams) వచ్చేనెల 2,3వ తేదీల్లో జరుగుతాయని తెలిపారు. బీఎడ్/ బీపీఎడ్ పరీక్షలు, సెప్టెంబర్ 6న, 8,న, 9వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంఈడీ పరీక్షలు (MED exams) 2వ తేదీన ప్రారంభమవుతాయని వెల్లడించారు.
పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. భారీ వర్షాల కారణంగా ఈనెల చివరలో జరగాల్సిన పరీక్షలను తెలంగాణ యూనివర్సిటీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.