ePaper
More
    Homeఫొటోలు & వీడియోలుScorpion | బాబోయ్.. క్యాప్సికంలో భ‌యంక‌ర‌మైన తేలు.. వైర‌ల్ అవుతున్న వీడియో

    Scorpion | బాబోయ్.. క్యాప్సికంలో భ‌యంక‌ర‌మైన తేలు.. వైర‌ల్ అవుతున్న వీడియో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Scorpion | మ‌నం తినే ఆహారంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఆహారం Food విషయానికి వస్తే, కూరగాయలు , పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. గ్రీన్ వెజిటేబుల్స్(Green Vegetables) కూడా మనకు కావల్సిన విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. కానీ కొన్ని కూరగాయలు తింటే పురుగులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు, క్యాబేజీ మరియు కాలీఫ్లవర్. వీటిలో మెదడు ఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యే టేప్‌వార్మ్‌(Tapeworm)లు ఉంటాయి. అవి తలచుకుంటేనే కొంచెం భయంగా ఉంది. అందుకే జాగ్రత్తగా వాటిని శుభ్రం చేసి, ఉడికించి తినాలి.

    Scorpion | బాబోయ్ తేలు..

    ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బఠానీలు వంటి ఆకుపచ్చ కూరగాయలలో చిన్న కీటకాలు తరచుగా చూస్తూ ఉంటాం. అయితే అవి కొన్నిసార్లు అవి కంటికి కనపడకుండా ఉంటాయి. దీంతో మనం చూసుకోకుండా వండేస్తాము. అప్పుడు అవి మన ఆహారంలో కనిపిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కీటకాలు కూరగాయలలో వ్యవసాయ క్షేత్రం నుంచే వచ్చేస్తుంటాయి. అంతే కాదు ఇవి కూరగాయాలను Vegetables పాడు చేస్తుంటాయి. ఈ కీటకాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కొన్నిసార్లు అవి కనిపించవు. కీటకాలు ఉన్న కూరగాయల వినియోగం మన ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతుంది.ఇవే ఇలా అనుకుంటే విషం ఉన్నవి కూర‌గాయ‌ల‌లో క‌నిపిస్తే ఎంత భ‌య‌బ్రాంతుల‌కి గుర‌వుతాం.

    తాజాగా క్యాప్సికంలో చిన్న తేలు(Scorpion) ప్ర‌త్య‌క్షం అయింది. ఓ మ‌హిళ క్యాప్సికం Capsicum క‌ర్రీ చేసేందుకు కూర‌గాయ‌లు కట్ చేస్తున్న స‌మ‌యంలో చిన్న తేలు క్యాప్సికంలో ప్ర‌త్య‌క్షం అయింది. ఇది చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. వామ్మో అస‌లు అందులోకి అలా ఎలా వెళ్లింద‌ని షాక్ అవుతున్నారు. అందుకే వంట చేయడానికి ముందు చెక్ చేసుకోవ‌డం అవసరం. ఏ కూర‌గాయ‌ల‌ని అయిన వినియోగించే ముందు క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. లేదంటే ప్రమాదంలో ప‌డ‌తాం.

    https://www.instagram.com/reel/DKHZa-Pzgwc/?utm_source=ig_web_copy_link

    More like this

    Encounter | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | జమ్మూ కశ్మీర్​లో సోమవారం తెల్లవారుజామున ఎన్​ కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ...

    US Open Final | యూఎస్ ఓపెన్ ఫైన‌ల్‌లో స‌త్తా చాటిన అల్క‌రాజ్.. తిరిగి నంబ‌ర్ 1 ర్యాంక్ సొంతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Open Final | యూఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు...

    Apprentice | ఐవోసీలో అప్రెంటిస్‌ పోస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apprentice | దేశవ్యాప్తంగా పలు అప్రెంటిస్‌(Apprentice) పోస్టుల భర్తీ కోసం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(Indian...