అక్షరటుడే, కామారెడ్డి: Health Department | స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్ను సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి విద్య (District Medical Officer Vidya) హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం జిల్లాస్థాయి అడ్వైజరీ పీసీపీఎండీటీ సమావేశాన్ని (PC-PNDT meeting) నిర్వహించారు.
Health Department | ప్రతినెలా స్కానింగ్ సెంటర్లను సందర్శించాలి..
ఈ సందర్భంగా డీఎంహెచ్వో విద్య మాట్లాడుతూ.. ప్రతినెలా స్కానింగ్ సెంటర్లను (scanning centers) ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్వో తప్పనిసరిగా సందర్శించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో ఫాం–ఎఫ్ రిజిస్టర్లను తనిఖీ చేస్తూ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు తగిన సూచనలు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే షోకాజ్ నోటీసులను జారీ చేయాలని ఆదేశించారు.
Health Department | జిల్లా అంతటా సమావేశాలు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో బేటీ బచావో బేటీ పడావో అనే అంశంపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో సూచించారు. సమావేశంలో నాలుగు స్కానింగ్ సెంటర్ల పర్మిషన్ గురించి చర్చించి డిస్ట్రిక్ట్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీకి అప్రూవల్ కోసం పంపించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హేమిమా, గైనకాలజిస్టులు దివ్య, శిరీష, ఐఎంఏ అధ్యక్షుడు శ్రీధర్, సఖి కో–ఆర్డినేటర్ కవిత, డెమో వేణుగోపాల్, స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీధర్, హెచ్వో చలపతి, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి పాల్గొన్నారు.