అక్షరటుడే, ఇందూరు: Scanning Centers | జిల్లాలో కొనసాగుతున్న స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
నిబంధనలు అతిక్రమిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్లో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష (Fetal determination test) నిషేధ చట్టం జిల్లా స్థాయి అడ్వైయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు.
Scanning Centers | ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ సెంటర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలని ఆదేశించారు. ఏ స్కానింగ్ కేంద్రంలో అయినా లింగ నిర్ధారణ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి సెంటర్ల అనుమతులు రద్దు చేయాలని, అవసరమైతే సీజ్ చేయాలని చెప్పారు.
Scanning Centers | రుసుము పట్టిక ఏర్పాటు..
ప్రతి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు నిర్ణీత రుసుమును మాత్రమే వసూలు చేయాలన్నారు. ఛార్జీలు గురించి తెలియజేసేలా పట్టిక ప్రదర్శించాలని పేర్కొన్నారు. అబార్షన్ కోసం వాడే ఔషధాలను క్వాలిఫైడ్ డాక్టర్ రిఫరల్ లేనిదే మెడికల్ షాపుల్లో (Medical shops) విక్రయించకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాల రికార్డులను, రిపోర్టులను క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు.
ఆడపిల్ల ప్రాధాన్యతపై, భేటీ బచావో బేటీ పడావోపై(Beti bachavo.. beti padavo), పాఠశాలల్లో కళాశాలలో, గ్రామ, మండల స్థాయి సమాఖ్య సమావేశాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ (DMHO Rajshri), డిప్యూటీ డీఎంహెచ్వో తుకారాం రాథోడ్, ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్, లీగస్ ప్రతినిధి రవి ప్రసాద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.