Homeబిజినెస్​Mutual Fund | ఎస్​బీఐ కొత్త ఫండ్​.. రేపటి నుంచే ప్రారంభం

Mutual Fund | ఎస్​బీఐ కొత్త ఫండ్​.. రేపటి నుంచే ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mutual Fund | దీర్ఘకాలికంగా మంచి రాబడుల కోసం మ్యూచ్​వల్​ ఫండ్స్ Mutual Funds ​లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఆయా ఫండ్​ మేనేజర్ల Fund managers పనితీరు, రిస్క్ risk అసెస్​మెంట్​తో పాటు ఆ ఫండ్​ పోర్ట్​ఫోలియోను చెక్​ చేసుకొని మ్యూచ్​వల్​ ఫండ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మ్యూచ్​వల్ ఫండ్​ పెట్టుబడులు స్టాక్​ మార్కెట్ stock market​ రిస్క్​కు లోబడి ఉంటాయి. కానీ దీర్ఘకాలికంగా చాలా వరకు ఫండ్లు మంచి ఆదాయాన్నే తెచ్చిపెట్టాయి.

ఎస్​బీఐ SBI తాజాగా కొత్త ఫండ్​ను ప్రారంభించనుంది. ఎస్‌బీఐ ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ SBI Income Plus Arbitrage Active ఎఫ్‌ఓఎఫ్ పేరుతో ఒక కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్ (FoF) పథకాన్ని ప్రారంభించింది. ఇది డెట్-ఓరియెంటెడ్ పథకాలు, ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెడుతుంది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ ఏప్రిల్ 23న ప్రారంభమై ఏప్రిల్ 30న ముగుస్తుంది. ఒకేసారి కనీసం రూ.5వేలు ఇన్వెస్ట్ invest​ చేయొచ్చు. నెలవారిగా ఎస్​ఐపీ అయితే రూ.500 నుంచి ప్రారంభించవచ్చు.