అక్షరటుడే, వెబ్డెస్క్ : SBI | ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ యూపీఐ సేవల్లో (UPI services) అంతరాయం కలిగింది. దీంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్బీఐ యూపీఐ లావాదేవీల (UPI transactions)కు బుధవారం అంతరాయం కలిగింది. దీంతో లావాదేవీలు చేయలేకపోతున్నామని ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బ్యాంక్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సైతం ఇదే సమస్యతో ఇబ్బంది పడ్డట్లు పలువురు యూజర్లు పోస్టులు పెట్టారు. ఇంత పెద్ద బ్యాంక్ నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై ఎస్బీఐ స్పందించింది.
SBI | సాంకేతిక కారణాలతో..
సాంకేతిక కారణాలతో యూపీఐ సేవల్లో అంతరాయం కలిగినట్లు ఎస్బీఐ ప్రకటించింది. టెక్నికల్ ప్రాబ్లెమ్స్తోనే ట్రాన్సక్షన్లు డిక్లైన్ అవుతున్నాయని తెలిపింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. వినియోగదారులు అంతరాయం లేని సేవ కోసం UPI లైట్ సేవలను కొనసాగించవచ్చని బ్యాంక్ తెలిపింది. కస్టమర్‌లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. అయితే రాత్రి 8 గంటలు దాటిపోయినా కస్టమర్లు అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.