అక్షరటుడే, హైదరాబాద్: SBI IMPS Charges 2026 | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India).. తన ఖాతాదారులపై ఛార్జీల మోత మోగించే పనిలో పడింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొబైల్, ఇతర మార్గాల ద్వారా తక్షణ చెల్లింపు (ఐఎంపీఎస్) లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయబోతోంది.
ఛార్జీలు ఇలా..
పెంచబోతున్న కొత్త ఛార్జీలు 2026 ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. మొబైల్ యాప్, ఇంటర్నెట్, యోనో లావాదేవీల (YONO Transactions)పైనా ఛార్జీలు వసూలు చేస్తారు. ఆన్లైన్ లావాదేవీల కోసం ఎస్బీఐ ఒక కొత్త శ్లాబ్ సిద్ధం చేసింది.
- రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకు లావాదేవీలు చేస్తే రూ.2+GST. రూ.
- రూ. లక్ష నుంచి రూ.2 లక్షలు లావాదేవీలు చేస్తే రూ.6+GST.
- రూ. రెండు లక్షల నుంచి రూ. 5 లక్షల లావాదేవీలకు చేస్తే రూ.10+GST.
- బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి చెల్లింపులు చేసినా IMPS ఛార్జీలు యథావిధిగా ఉంటాయి.
ఎస్బీఐలో శాలరీ ప్యాకేజ్ ఉన్నవారు కంగారు పడాల్సిన అవసరం లేదు. ICSP, DSP, PMSP, CGSP, PSP ద్వారా జీతం పొందుతున్న వారికి ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. దీంతోపాటు ఎస్బీఐ ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్, శౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతా ఉన్నవారికి మినహాయింపు కొనసాగుతుంది.
IMPS అనేది 24 గంటలు పని చేసే చెల్లింపుల వ్యవస్థ. సెలవు రోజుల్లోనూ క్షణాల్లో డబ్బును పంపించొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా రూ.25 వేల వరకు పంపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
రూ.25 వేల-రూ. లక్ష వరకు రూ. 2 +GST, రూ. లక్ష – 2 లక్షల వరకు రూ. 6 +GST, రూ.2 లక్షల-5 లక్షల వరకు రూ.6 +GST వసూలు చేయనుంది. అయితే రూ.25 వేల కంటే తక్కువ. నగదు బదిలీకి ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు.