అక్షరటుడే, వెబ్డెస్క్ : SBI | దేశీయ పబ్లిక్ సెక్టార్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అంటే భారతీయులకు అపారమైన నమ్మకం ఉంటుంది. కోట్లాది మంది ఈ బ్యాంకులో ఖాతా కలిగి ఉండగా, ఇప్పుడు ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed Deposits), రికరింగ్ డిపాజిట్ల(Recurring deposits) రూపంలో వస్తుంటాయి. అయితే ఇప్పుడు తమ కస్టమర్లకు(Customers) సడెన్ షాకిచ్చింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లలో భారీ కోత పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) గత రెండు ద్వైమాసిక సమీక్షా సమావేశల్లో రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. దీంతో ఎస్‌బీఐ SBI సైతం వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
SBI | ఇంత పని చేసింది..
వడ్డీ రేట్ల తగ్గింపు డిపాజిటర్లకు(Depositors) బ్యాడ్ న్యూస్ అయితే లోన్లు తీసుకునేవారికి మాత్రం గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. అన్ని రకాల మెచ్యూరిటీ టెన్యూర్ల డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటులో తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ(SBI) తాజాగా ప్రకటించింది. 444 రోజుల స్పెషల్ టెన్యూర్ డిపాజిట్లకూ ఈ వడ్డీ రేటు తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. సవరించిన వడ్డీ రేట్లు నేటి (మే 16, 2025 శుక్రవారం) నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత 444 రోజుల స్పెషల్ టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం వడ్డీ రేటు 7.05 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది. 60 ఏళ్లలోపు వయసు గల జనరల్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే 444 రోజుల పథకం ద్వారా సీనియర్లకు Seniors 7.35 శాతం వడ్డీ లభించనుంది.
సవరించిన కొత్త వడ్డీ రేట్లు రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. రూ.3 కోట్ల లోపు ఉండే డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. వాటికి వడ్డీ రేట్లు వేరుగా ఉంటాయని తెలుస్తుంది.. మరోవైపు ఎస్‌బీఐ ఉద్యోగులకు(SBI Employees) మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా 100 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ కల్పించనుందని అంటున్నారు. కార్డు రేటుపై 100 బేసిస్ పాయింట్ల వడ్డీ ఎక్కువొస్తుంది. రానున్న కాలంలో మరో 2-3 సార్లు వడ్డీ రేట్ల తగ్గించే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ బ్యాంకులో పని చేసే సిబ్బందికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై Fixed Deposits ఏకంగా 100 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ కల్పిస్తోంది. కార్డు రేటుపై 100 బేసిస్ పాయింట్ల వడ్డీ ఎక్కువొస్తుంది. ఉదాహరణకు 444 రోజుల టెన్యూర్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్(Special Deposit Scheme) అయితే 7.85 శాతం మేర వడ్డీ లభిస్తుంది.