Homeబిజినెస్​SBI Interest Rate | రుణగ్రహీతలకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటన

SBI Interest Rate | రుణగ్రహీతలకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: SBI Interest Rate | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు తాజాగా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (EBLR) హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును ఇటీవల 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే ఎస్‌బీఐ కూడా రుణ వడ్డీ రేట్లను ఆ మేరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేట్లు (new interest rates) 2025 జూన్ 15 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది.ఇది రుణ గ్రహీతలకు ఎంతో మేలు చేకూర్చనుంది.

SBI Interest Rate | వడ్డీ రేట్లు తగ్గడంతో..

ఆర్థిక రంగంలో సానుకూలతలతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుతున్న తరుణంలో రిజర్వ్‌ బ్యాంక్‌ (Reserve Bank) ఇటీవల వడ్డీ రేట్లను సవరించింది. ఆర్థిక వ్యవస్థ కు ఊతమివ్వడానికి, ప్రజలు ఎక్కువగా లోన్స్ తీసుకుని వ్యాపారాలు, కొనుగోళ్లు చేసేలా ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటును (repo rate) 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి దిగొచ్చింది. ఎక్స్టర్నల్‌ బెంచ్ మార్క్ (ఈబీఎల్) 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. హోమ్‌లోన్‌ (Home loan), ఎంఎస్‌ఎంఈ, రిజర్వ్ బ్యాంక్‌ సూచించిన కొన్ని రుణాలకు ఈబీఎల్ వర్తిస్తుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో EBLRతో లింక్ అయిన అన్ని రకాల లోన్లు, ముఖ్యంగా హోమ్ లోన్లు మరింత చౌకగా మారతాయి.

ఎస్‌బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించడంతో ఆ మేరకు రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు (home loan interest rates) CIBIL స్కోర్, ఫైనాన్షియల్ ప్రొఫైల్ బట్టి, 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్యలో ఉంటాయి. మంచి CIBIL స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది. ఈ రేట్లు కస్టమర్ల ప్రొఫెషన్, పాత లోన్లు, రీపేమెంట్ ప్రొఫైల్ ఆధారంగా మారుతూ ఉంటాయి. తాజా మార్పుల తర్వాత, ఎస్‌బీఐలో మ్యాక్స్గెయిన్ ఓవర్డ్రాఫ్ట్ (OD) హోమ్ లోన్పై వడ్డీ రేటు (home loan interest rate) 7.75 శాతం నుంచి 8.70 శాతం మధ్య ఉంటుంది. టాప్-అప్ హోమ్ లోన్లు 8.00 శాతం నుంచి 10.50 శాతం వరకు ఉంటాయి. టాప్-అప్ (OD) వేరియంట్లకు వడ్డీ 8.25 శాతం నుంచి 9.20 శాతం వరకు ఉంటుంది.

వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత స్టేట్ బ్యాంకులో లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ (LAP) లోన్ 9.20 శాతం నుంచి మొదలవుతుంది. రివర్స్ మార్ట్గేజ్పై వడ్డీ 10.55 శాతంగా ఉంది. అయితే, ఎస్‌బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. 2025 జూన్ 14 నుంచి అవే రేట్లు కొనసాగుతున్నాయి.

Must Read
Related News