HomeUncategorizedSBI | సైబ‌ర్ మోసాల అడ్డుక‌ట్ట‌కు ఎస్‌బీఐ ప్లాన్.. ప్ర‌త్యేక నెంబ‌ర్స్ విడుద‌ల‌

SBI | సైబ‌ర్ మోసాల అడ్డుక‌ట్ట‌కు ఎస్‌బీఐ ప్లాన్.. ప్ర‌త్యేక నెంబ‌ర్స్ విడుద‌ల‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: SBI | ఈ రోజుల్లో సైబ‌ర్ మోసాలు ఏ రేంజ్‌లో జ‌రుగుతున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) కస్టమర్స్ మోస‌పోకుండా ఉండేందుకు, బ్యాంక్ నుండి వచ్చే అధికారిక కాల్స్ కోసం ప్రత్యేక నంబర్లను ప్రకటించింది. SBI కస్టమర్లకు సేవలందించడానికి +91-1600 ప్రారంభమయ్యే నంబర్లను మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్ అధికారికమైనవి. ట్రాన్సాక్షన్, సేవల సంబంధిత సమాచారాన్ని అందించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. +91 1600తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి కాల్ స్వీకరిస్తే అది నిజమైన, చట్టబద్ధమైన కాల్ అని నమ్మాలని ఎస్బీఐ తెలిపింది.

SBI | ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

ఇతర నంబర్ల నుంచి వచ్చే స్పామ్ లేదా మోసపూరిత కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచించింది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులకు, నియంత్రిత సంస్థలకు (Regulated Entities) ఒక నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. SBI సైబర్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో వినియోగదారులు వీటిపై అవగాహన త‌ప్ప‌క క‌లిగి ఉంటే మంచింది. వినియోగదారులు SBI అధికారిక నంబర్లను మాత్రమే గుర్తించాలి. అసాధారణ నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతిసారీ వస్తున్న అపరిచిత కాల్స్‌పై డౌట్ ఉంటే, SBI అధికారిక ఛానెల్స్ ద్వారా వాస్తవికతను నిర్ధారించుకోవాలి. మీకు అసందర్భ కాల్స్, SMS, లేదా లింకులు ఏమైనా వచ్చినప్పుడు వాటిపై తక్షణమే స్పందించి దూరంగా ఉండ‌డం చేయాలి.

ఇక SBI విడుద‌ల చేసిన‌ అధికారిక నంబర్లు చూస్తే.. 1600-01-8000,1600-01-8003, 1600-01-8006, 1600-11-7012, 1600-11-7015, 1600-01-8001, 1600-01-8004, 1600-01-8007, 1600-11-7013, 1600-00-1351, 1600-01-8002, 1600-01-8005, 1600-11-7011, 1600-01-7014, 1600-10-0021 ఈ నెంబ‌ర్స్ మాత్ర‌మే SBI కాల్స్‌కు సంబంధించినవి. మరే ఇతర నంబర్ల నుంచి వస్తున్న ఫోన్లపై వినియోగదారులు జాగ్రత్త వహించాలి. గూగుల్ Google లేదా ఇతర వనరుల ద్వారా పొందిన అనధికారిక నంబర్లను ఉపయోగించి కాల్ చేసి ఇబ్బందుల్లో ప‌డ‌కండి.

Must Read
Related News