ePaper
More
    HomeజాతీయంBombay High Court | ప్రేమిస్తున్నానని చెప్పడం భావ వ్యక్తీకరణ మాత్రమే.. లైంగిక వేధింపుల కిందకు...

    Bombay High Court | ప్రేమిస్తున్నానని చెప్పడం భావ వ్యక్తీకరణ మాత్రమే.. లైంగిక వేధింపుల కిందకు రాదన్న బాంబే హైకోర్టు నాగ్​పూర్ బెంచ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bombay High Court | ప్రేమిస్తున్నానని చెప్పడం కేవలం భావ వ్యక్తీకరణ మాత్రమేనని, అది లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు(Bombay High Court) నాగ్​పూర్ బెంచ్ స్పష్టం చేసింది. 2015లో టీనేజ్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 35 ఏళ్ల వ్యక్తిని జస్టిస్ ఊర్మిళా జోషి-ఫాల్కే బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. బాలికకు ఐలవ్​యూ చెప్పడం లైంగిక దాడి కింద పరిగణిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయడమే కాకుండా.. ఈ కేసులో నిందితుడికి విధించిన మరణ శిక్షను రద్దు చేసింది. ఈ కేసును విచారిస్తున్న సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా లైంగిక చర్యలో భాగంగా అనుచితంగా తాకడం, బలవంతంగా దుస్తులు విప్పడం, అసభ్యకరమైన హావభావాలు లేదా స్త్రీ అణకువను అవమానించే ఉద్దేశ్యంతో చేసిన వ్యాఖ్యలు కూడా ఉంటాయని బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది.

    Bombay High Court | ఐలవ్​యూ చెప్పాడని శిక్ష

    17 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా నిందితుడు ఆమె చేతులు పట్టుకుని “ఐలవ్​యూ” అని చెప్పాడు. దీంతో ఆ బాలిక ఇంటికి వెళ్లి తన తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు స్కూల్ నుంచి ఇంటికొస్తుండగా, నిందితుడు ఆమె చేతులు పట్టు కుని “ఐలవ్​యూ” అని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన నాగ్​పూర్​లోని సెషన్స్ కోర్టు(Nagpur Sessions Court) 2017లో ఇండియన్ పీనల్ కోడ్, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారించింది. బెంచ్ అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది.

    Bombay High Court | లైంగిక వేధింపులు కావు..

    అయితే, కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం.. ఈ కేసు లైంగిక వేధింపులు(Sexual harassment) లేదా లైంగిక వేధింపుల పరిధిలోకి రాదని పేర్కొంటూ నిందితుడికి విధించిన శిక్షను రద్దు చేసింది. ఈ కేసులో ఆ అమ్మాయితో లైంగిక సంబంధం ఏర్పరచుకోవడమే అతని ఉద్దేశ్యమని ఏ పరిస్థితి సూచించలేదని హైకోర్టు పేర్కొంది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని వ్యక్తీకరించబడిన పదాలు శాసనసభ ఆలోచించినట్లుగా లైంగిక ఉద్దేశానికి సమానం కావని తెలిపింది. “ఎవరైనా తాను మరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని చెబితే లేదా తన భావాలను వ్యక్తపరిస్తే, అది ఏదో ఒక రకమైన లైంగిక ఉద్దేశాన్ని చూపించే ఉద్దేశంగా పరిగణించబడదు” అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...