అక్షరటుడే, వెబ్డెస్క్ : Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది.
అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (HPAI) వ్యాప్తి కారణంగా సౌదీ అరేబియా కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) వెబ్‌సైట్‌లో ఆయా దేశాల జాబితాను ఉంచింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం, స్థానిక మార్కెట్లో ఆహార భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని దేశాలపై నిషేధం 2004 నుంచి అమలులో ఉన్నాయని పేర్కొంది. తాజాగా ఆ జాబితాలో మరికొన్ని దేశాలను చేర్చింది. ఇందులో భారత్, బ్రిటన్ కూడా ఉన్నాయి.
Saudi Poultry Import Ban | ఈ దేశాలపై..
కోళ్ల మాంసం, టేబుల్ ఎగ్ దిగుమతులపై పూర్తి నిషేధం 40 దేశాలకు వర్తిస్తుంది. అవి.. అఫ్ఘానిస్థాన్, అజర్‌బైజాన్, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్, బోస్నియా, హెర్జెగోవినా, బల్గేరియా, బంగ్లాదేశ్, తైవాన్, జిబౌటి, దక్షిణాఫ్రికా, చైనా, ఇరాక్, ఘనా, పాలస్తీనా, వియత్నాం, కంబోడియా, కజకిస్థాన్, కామెరూన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, లావోస్, లిబియా, మయన్మార్, యునైటెడ్ కింగ్‌డమ్, ఈజిప్ట్, మెక్సికో, మంగోలియా, నేపాల్, నైజర్, నైజీరియా, భారతదేశం, హాంకాంగ్, జపాన్, బుర్కినా ఫాసో, సూడాన్, సెర్బియా, స్లోవేనియా, ఐవరీ కోస్ట్ మోంటెనెగ్రో ఉన్నాయి. మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది.
