అక్షరటుడే, వెబ్‌డెస్క్: Saudi Arabia Accident | సౌదీ అరేబియాలో జరిగిన భయంకర బస్సు ప్రమాదం Bus Accident భారతీయ ఉమ్రా యాత్రికులకు అతి పెద్ద విషాదాన్ని మిగిల్చింది.
నవంబర్ 17, 2025న భారత కాలమానం ప్రకారం సుమారు 1:30 AM గంటలకు బదర్–మదీనా మధ్య ముఫరహత్ Mufarhat ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మక్కా Mecca లో ఉమ్రా యాత్ర Umrah pilgrims ను పూర్తి చేసుకుని మదీనా Madinah కు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 42 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది.
Saudi Arabia Accident | నిద్రలోనే మృతి
మరణించిన వారిలో హైదరాబాద్ Hyderabad, తెలంగాణలోని Telangana పలు ప్రాంతాలకు చెందిన యాత్రికులు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. బస్సులోని చాలా మంది యాత్రికులు నిద్రలో ఉండగానే ప్రమాదం జరిగినట్టు స్థానిక వర్గాలు వెల్లడించాయి.
మక్కా Mecca మసీదు అల్‌హరామ్‌లో ప్రార్థనలు, తౌవాఫ్ వంటి యాత్రా కార్యక్రమాలు ముగించుకున్న యాత్రికులు మదీనాలోని మసీదు అన్–నబవీ దర్శనానికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ఈ మార్గం భారతీయ యాత్రికులు తరచుగా ఉపయోగించే రహదారి కావడంతో, ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని రేపింది.
కొన్ని కుటుంబాలు ఒకరి కంటే ఎక్కువ మందిని కోల్పోవడం విషాదాన్ని మరింత పెంచింది. ఘటన జరిగిన వెంటనే సౌదీ రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరణాల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ స్థానిక మీడియా 42 మంది మరణించినట్టు నిర్ధారించింది.
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత హజ్ కమిటీ ఘటనపై నిశితంగా నిఘా పెట్టాయి. మృత దేహాలను భారత్‌కు తరలించేందుకు ప్రత్యేక విమానాల ఏర్పాట్లు చేస్తున్నాయి. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సౌకర్యం అందించేందుకు దౌత్యవర్గం సౌదీ అధికారులతో సమన్వయం చేస్తోంది.
ఈ ఘటనతో ఉమ్రా యాత్రికుల umrah pilgrims భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు మక్కా–మదీనాల మధ్య ప్రయాణిస్తుంటారు.
అయితే ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. 2023లో జరిగిన ఇలాంటి ప్రమాదంలో 20 మంది మరణించడంతో భద్రతా అంశంపై అప్పటి నుంచే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
