More
    Homeజిల్లాలుకామారెడ్డిCongress Party | కాంగ్రెస్​ నుంచి సౌదాగర్ అరవింద్​​ సస్పెన్షన్​

    Congress Party | కాంగ్రెస్​ నుంచి సౌదాగర్ అరవింద్​​ సస్పెన్షన్​

    Published on

    అక్షరటుడే, డోంగ్లి: Congress Party | కాంగ్రెస్ నుంచి సౌదాగర్​ అరవింద్​​ను (Saudagar Arvind) సస్పెండ్​ చేస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇతర పార్టీలకు మద్దతు తెలిపినట్లు రుజువు కావడంతో ఆయనను సస్పెండ్​ (suspend) చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్​ గంగారం (former Jukkal MLA Saudagar Gangaram) సొంత సోదరుడి కుమారుడు సౌదాగర్​ అరవింద్​​. 2023 నవంబర్​లోనే అరవింద్​​ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి సస్పెండ్​ చేసినప్పటికీ.. తాను పార్టీలోనే ఉన్నట్లు చెప్పుకుంటూ చెలామణి అవుతున్నట్లు తమవద్ద సమాచారం ఉన్నట్లు పార్టీ తెలిపింది. 2024లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేశాడని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

    ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీ (Congress party) అధికారంలో ఉన్నందున అరవింద్​ కాంగ్రెస్​ పార్టీ పేరుతో తప్పుడు పైరవీలు చేసుకునే అవకాశముందనే ఉద్దేశంతో ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సౌదాగర్​ అరవింద్​ జుక్కల్​ నియోజకవర్గ ఎస్సీ సెల్​ ఛైర్మన్​గా చెలామణి అవున్నట్లు తమవద్ద సమాచారం ఉందని.. కానీ ఆయనకు కాంగ్రెస్​లో ఎలాంటి పదవులు లేవన్నారు.

    More like this

    Hollywood Actress | హాలీవుడ్ నటికి బంపర్ ఆఫర్.. ఒక్క సినిమాకు రూ.530 కోట్ల రెమ్యూనరేషన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hollywood Actress | హాలీవుడ్ నటి జాక్ పాట్ కొట్టేసింది. సినిమాలో నటించడానికి ఏకంగా...

    KTR | కేసీఆర్​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో...

    Pakistan Cricket | పాకిస్తాన్ సంచలన నిర్ణయం?.. యూఏఈతో క్రికెట్ మ్యాచ్ బాయ్కాట్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Cricket | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్(Asia...