అక్షరటుడే, కామారెడ్డి: Satyanarayana Swamy Kalyanam | పట్టణంలోని (Kamareddy City) రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Satyanarayana Swamy Kalyanam | వార్షికోత్సవాల్లో భాగంగా..
వార్షికోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులు శాంతిహోమాలు, ప్రత్యేక యజ్ఞాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూర్ణాహుతి (Purnahuti) సమర్పించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం ఆలయ అర్చకులు స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలే (Kamareddy Municipality) కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.