అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Microsoft CEO Satya Nadella) భేటీ అయ్యారు. భారత్‌లో భారీ పెట్టుబడులకు ఆయన అంగీకారం తెలిపారు. మైక్రోసాఫ్ట్ దేశంలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
ప్రధాని మోదీతో (Prime Minister Modi) మంగళవారం సాయంత్రం సత్య నాదెళ్ల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధిని బలోపేతం చేయడానికి 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా ఇది ఆసియాలో కంపెనీ అతిపెద్ద పెట్టుబడి కావడం గమనార్హం.
PM Modi | ఎక్స్ వేదికగా ప్రకటన
మోదీతో సమావేశం అనంతరం సత్య నాదెళ్ల ఎక్స్ వేదికగా పెట్టుబడులపై ప్రకటన చేశారు. దేశ ఏఐ అవకాశంపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు మోదీజీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి, భారతదేశం AI-మొదటి భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు మరియు సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ సంస్థ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO) భారత్‌లో రెండోసారి పర్యటిస్తున్నారు.
PM Modi | స్పందించిన ప్రధాని
సత్య నాదెళ్ల పోస్ట్‌కు ప్రధాని మోదీ స్పందించారు. ఏఐ విషయంలో ప్రపంచం భారతదేశం గురించి ఆశాజనకంగా ఉందన్నారు. సత్య నాదెళ్లతో చాలా మంచి చర్చ జరిగిందన్నారు. మైక్రోసాఫ్ట్ ఆసియాలో తన అతిపెద్ద పెట్టుబడిని చేసే ప్రదేశంగా భారతదేశం ఉండటం చూసి సంతోషంగా ఉందన్నారు. దేశ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని పేర్కొన్నారు.