అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Fourth Town Police Station | నగరంలో నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వోగా సతీష్‌కుమార్ (SHO Satish Kumar) బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఛార్జ్ తీసుకున్నారు. సతీష్‌కుమార్‌ను నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వోగా నియమిస్తూ ఇటీవల సీపీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Inspector postings | ఎస్హెచ్వోలుగా అప్‌గ్రేడ్
నిజామాబాద్ నాలుగో ఠాణా, రూరల్ పోలీస్ స్టేషన్లకు (Rural Police station) ఇది వరకు ఎస్సైలు ఎస్హెచ్వోలుగా వ్యవహరించేవారు. కాగా.. ఆయా ఠాణాల పరిధిలో కేసులు పెరగడం, శాంతి భద్రతల పరిరక్షణ తదితర కారణాల రీత్యా ఇన్స్పెక్టర్లను ఎస్హెచ్వోలుగా నియమించాలని సీపీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన పంపిన ప్రతిపాదనకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆమోదం తెలిపారు. తదనుగుణంగా ఇన్స్పెక్టర్లను ఎస్హెచ్వోలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
