Homeజిల్లాలునిజామాబాద్​MLA Rakesh Reddy | సంక్షేమ ఫలాలు పేదలకు అందినప్పుడే సంతృప్తి: ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

MLA Rakesh Reddy | సంక్షేమ ఫలాలు పేదలకు అందినప్పుడే సంతృప్తి: ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

సంక్షేమ ఫలాలు పేదలకు అందినప్పుడే సంతృప్తి కలుగుతుందని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్​లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను గురువారం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ ​: MLA Rakesh Reddy | ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందినప్పుడే తనకు సంతృప్తి కలుగుతుందని ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఆలూర్​ మండల కేంద్రంలో గురువారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కుల (Shaadi Mubarak Cheques) పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్య​అతిథిగా విచ్చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.
సాంకేతిక సమస్యల కారణంగా ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) లబ్ధిదారుల బిల్లులు పెండింగ్‌లో ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, తహశీల్దార్ రమేష్, ఆర్ఐ రేణుక, బీజేపీ మండల అధ్యక్షుడు సూర శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అరుణ్, గంగోల్ల ప్రళయ్ తేజ్, మల్లయ్య, బండారి యాదగిరి, సుభాష్, నవీన్, అర్జిత్, పోశెట్టి, సురేష్ గౌడ్, శివ కేశవులు, గగ్గుపల్లి నరేష్, మిట్టపల్లి నారాయణ, పసకొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.