48
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మున్సిపల్ మాజీ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ (Kudumula Satyanarayana) సూచించారు. మండలంలోని పలు గ్రామాల సర్పంచ్, ఉపసర్పంచ్ (Deputy Sarpanch)లను బుధవారం ఘనంగా సన్మానించారు.
రేపల్లెవాడ, సబ్దల్పూర్, మల్లయ్యపల్లి, మౌలాన్ఖేడ్,అల్మాజీపూర్, బ్రాహ్మణపల్లి, లక్ష్మాపూర్, హాజీపూర్, అడవిలింగాల్ సర్పంచ్లు దుద్దుల వనిత సాయిరాం, బయ్యని స్వప్న సాయిలు, ఎరువుల లక్ష్మీ మైసయ్య, పుట్ల చంద్రశేఖర్, దత్తు, అంజయ్య, నాయక్ సాయిలు, రతన్ నాయక్, మంగలి సంతోష్ తదితరులను సన్మానంచారు. అలాగే ఉపసర్పంచ్లు వెంకటేశం, సత్యనారాయణ, చింతల రాజు, అంజయ్య, మహిపాల్, యాదయ్య, బీరప్పలను సైతం అభినందించారు.