అక్షరటుడే, ఎల్లారెడ్డి: MLA Lakshmi kantha Rao | సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmikantharao) పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గెలిచిన సర్పంచ్‌లు ఎమ్మెల్యేను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారందరిని ఘనంగా సన్మానించారు.
MLA Lakshmi kantha Rao | ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాలి..
అనంతరం మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గ (Jukkal constituency) ప్రజలు ఎంతో విశ్వాసంతో సర్పంచ్‌లుగా మిమ్మల్ని గెలిపించుకున్నారని.. వారి నమ్మకాన్ని కాపాడుకోవాలన్నారు. గ్రామాల్లోని ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకువాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయాలని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.