అక్షరటుడే, ఆర్మూర్ : Alur Mandal | సర్పంచ్‌లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీడీవో గంగాధర్ (MPDO Gangadhar) సూచించారు. ఆలూర్ మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Alur Mandal | ప్రభుత్వ పథకాలు అమలుపై..
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనుల ప్రణాళిక, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ల (Sarpanch) పాత్రపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, రహదారుల సంరక్షణ, పన్నుల వసూలు, అభివృద్ధి పనుల్లో పారదర్శకత, ప్రభుత్వ నిబంధనల పాటింపు వంటి సర్పంచ్‌ల విధులు, బాధ్యతల గురించి వివరించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Alur Mandal | ప్రభుత్వ మార్గదర్శకాలు..
ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీడీవో సూచించారు. ప్రతి సర్పంచ్ గ్రామ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొని, సమస్యల పరిష్కారంలో ముందుండి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమం అనంతరం ఎంపీడీవో గంగాధర్ నూతన సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజలింగం, సర్పంచ్‌లు ముక్కెర విజయ్, యల్లా సాయిరెడ్డి, కట్ట నర్సయ్య, నడ్పి గంగాధర్, మచర్ల చిన్నయ్య, పుష్ప, గంగోల్ల సుస్మిత, కొండ్ర కమల, భూషణ్, పంచాయతీ కార్యదర్శులు కిషోర్, చంద్రశేఖర్, దినేష్, నాగేంద్ర, నసీర్, నవీన్, వందన, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.