363
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | గ్రామ అభివృద్ధిలో సర్పంచులదే కీలక బాధ్యత అని ఆర్డీవో పార్థసింహారెడ్డి (RDO Parthasimha Reddy), డీఎల్పీవో సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నూతనంగా సర్పంచులుగా (Sarpanches) ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. గ్రామాల వారిగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
Yellareddy | ఇబ్బందులు లేకుండా చూడాలి
గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచులు చూసుకోవాలని అధికారులు సూచించారు. ఎలాంటి విభేదాలు తలెత్తకుండా స్నేహపూర్వక వాతావరణంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టుకోవాలన్నారు. త్వరలో ప్రభుత్వం నుంచి అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో తహెరా బేగం, ఈవోపీఆర్డీ ప్రకాష్, ఎంఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.