215
అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్, ఆలూరు మండలాల్లో మూడో దశలో పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) జరగనున్నాయి. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో అధికారులు ఏకగ్రీవం అయిన అభ్యర్థుల వివరాలు వెల్లడించారు.
ఆలూర్ మండలం (Aloor Mandal) మిర్దాపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి ఎటువంటి ప్రత్యర్థులు లేకపోవడంతో యల్లా సాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన యల్లా సాయిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, అందరికీ అందుబాటులో ఉంటూ పారదర్శక పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేగాం లింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.