అక్షరటుడే, ఎల్లారెడ్డి : Peddakodapgal | జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును (Jukkal MLA Thota Lakshmi Kanta Rao) కుభ్యనాయక్ తండా సర్పంచ్ అభ్యర్థి కలిశారు. జుక్కల్ నియోజకవర్గం (Jukkal constituency) పెద్దకొడప్గల్ మండలం కుభ్యనాయక్ తండాలో సర్పంచ్‌గా గాయత్రి గోవింద్‌ను ఎన్నుకోవాలని గ్రామస్థులు తీర్మానం చేశారు.
పిట్లం మండలంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ (DCC President Ele Mallikarjun) సన్మాన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తండా వాసులు తీర్మానం చేసిన నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి గాయత్రి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. కుభ్యనాయక్ తండా ప్రజలు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానం చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.