ePaper
More
    Homeక్రీడలుSarfaraz Khan | రెండు నెల‌ల్లో 17 కేజీల బ‌రువు త‌గ్గిన టీమిండియా స్టార్.. ఎంత...

    Sarfaraz Khan | రెండు నెల‌ల్లో 17 కేజీల బ‌రువు త‌గ్గిన టీమిండియా స్టార్.. ఎంత మారిపోయాడు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sarfaraz Khan | టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) తన ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాడు. టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లక్ష్యంతో కఠినమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో జట్టు నుంచి తప్పించ‌గా, ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ క్ర‌మంలో తన బరువును గణనీయంగా తగ్గించుకున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్(Body Transformation) ఫొటోలను షేర్ చేసిన సర్ఫరాజ్, నెటిజన్లను షాక్‌కు గురిచేశాడు.

    Sarfaraz Khan | ఇంత త‌గ్గాడు..

    రెండు నెలల కాలంలో ఏకంగా 17 కిలోలు బరువు తగ్గాడు. దీనిపై నెటిజ‌న్స్ స్పందిస్తూ..“బాప్‌రే.. ఇది నిజంగా అద్భుతం!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకున్న సర్ఫరాజ్ ఖాన్‌ను మళ్లీ టీమిండియా(Team India)లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు అభిమానులు. సర్ఫరాజ్‌ డైట్‌ పూర్తిగా మారిపోయింది. అన్నం, గోధుమల ఆహారాన్ని పూర్తిగా మానేసి, ఉడికించిన చికెన్, గుడ్లు, కూరగాయలు, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తీసుకున్నాడు. ఆలివ్ ఆయిల్ కూడా తక్కువ మోతాదులోనే ఉపయోగించాడు. అతని తండ్రి నౌషద్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మా కుటుంబం మొత్తం బరువు తగ్గించుకోవడంపైనే ఫోకస్ పెట్టింది. సర్ఫరాజ్‌ మొదటి 6 వారాల్లోనే 9 కిలోలు తగ్గాడు. అది అంత తేలికపాటి విష‌యం కాదు అని అన్నాడు.

    READ ALSO  Chess World Cup | రెండు ద‌శాబ్దాల‌ త‌ర్వాత తొలిసారి.. ఇండియాలో చెస్ ప్రపంచక‌ప్‌ పోటీలు

    నిరంతరంగా జిమ్‌ చేయడం, స్టేడియంలో రన్నింగ్‌, స్విమ్మింగ్‌ వంటివన్నీ రోజువారీ రొటీన్‌లో భాగమయ్యాయి. సర్ఫరాజ్ సోదరుడు మోయిన్ ఖాన్ కూడా బరువు తగ్గేందుకు కృషి చేశాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన సర్ఫరాజ్, మరోవైపు ఇంగ్లండ్ లయన్స్‌(England Lions)తో జరిగిన అనధికారిక టెస్ట్‌ల్లో 92, 101 పరుగులు చేసి ఫామ్ చూపించాడు. అయితే, సెలక్టర్ల దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోయాడు. అయితే అతని స్థానంలో తీసుకున్న కరుణ్ నాయర్ తక్కువ స్కోరులతో నిరాశపరిచాడు. దీంతో త్వరలో జరిగే న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌(New Zealand Test Series)లో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో గాయమై జట్టులో చోటు కోల్పోయిన అతను, ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా మారి జ‌ట్టులో చోటు కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు.

    READ ALSO  Luke Hollman | ల‌గాన్ షాట్‌ని దింపేశాడుగా.. ఈ షాట్ చూస్తే ప‌డిప‌డి న‌వ్వుకుంటారు..!

    Latest articles

    CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన...

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య...

    CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్​ నాయకుడు (BJP Leader)...

    More like this