అక్షరటుడే, ఇందూరు: National Unity Day | నిరంకుశ పాలనను అంతమొందించి నిజం మెడలు వంచిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచార్య అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి వర్ని చౌరస్తా వరకు ఏక్తా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అఖండ భారత్ కోసం సర్దార్ పటేల్ (Sardar Vallabhbhai Patel) విశేష కృషి చేశారని కొనియాడారు. దేశంలోని 500కు పైగా సంస్థలను ఏకం చేసి అఖండ భారత్ కోసం పరితపించిన గొప్ప నేత అన్నారు. హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ఆపరేషన్ పోలో నిర్వహించారన్నారు. ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యక్రమ కన్వీనర్ పోతనకర్ లక్ష్మీనారాయణ, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

