HomeతెలంగాణSARASWATI PUSHKARALU | నేటి నుంచే సరస్వతి పుష్కరాలు.. హాజరుకానున్న సీఎం రేవంత్​

SARASWATI PUSHKARALU | నేటి నుంచే సరస్వతి పుష్కరాలు.. హాజరుకానున్న సీఎం రేవంత్​

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: SARASWATI PUSHKARALU : గోదావరి, సరస్వతి, ప్రాణహిత(Godavari, Saraswati, Pranahita) నదుల త్రివేణి సంగమ స్థానమైన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు రానే వచ్చేశాయి. కాళేశ్వర త్రివేణి సంగమ (Kaleshwara Triveni Sangam) ప్రాంతంలో నేటి (మే 15న) నుంచి భక్తుల సందడి నెలకొనబోతోంది.

పుష్కరాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నదిలో సరిపడా నీటి ప్రవాహం ఉండటంతో పుణ్యస్నానాలకు సమస్య లేదు. భక్తులు సేదదీరేందుకు చలువ పందిళ్లు వేశారు.

సరస్వతి పుష్కరాల ప్రారంభ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హాజరుకానున్నారు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ (Saraswati Ghat)​ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కాళేశ్వర త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు.

ఉదయం 5:44 గంటలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో సీఎం రేవంత్​ రెడ్డి పుష్కర స్నానాలు ప్రారంభించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

SARASWATI PUSHKARALU : ప్రత్యేకంగా మహాలక్ష్మి బస్సులు

సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సన్నద్ధమైంది. ఈ నెల 26 వరకు జరగనున్న ఈ పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున.. అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (RTC MD VC Sajjanar) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇందుకు మహాలక్ష్మీ బస్సుల(Mahalaxmi buses)ను వినియోగించనున్నట్లు పోస్టు చేశారు.

SARASWATI PUSHKARALU : 40 మంది కలిసి వెళ్లాలనుకుంటే.. కాలనీకే బస్సు..

JBS, MGBS, కూకట్ పల్లి, ఉప్పల్, జీడిమెట్ల, మేడ్చల్ (JBS, MGBS, Kukatpally, Uppal, Jeedimetla, Medchal), తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని సజ్జనార్​ తెలిపారు. 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలని అనుకుంటే వారి కాలనీలకే ప్రత్యేక బస్సులను పంపేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు.