ePaper
More
    HomeతెలంగాణSaraswati Pushkaralu | నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు

    Saraswati Pushkaralu | నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Saraswati Pushkaralu | కాళేశ్వరంలోని త్రివేణి సంగమం ద్ద సరస్వతి పష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. త్రివేణిం సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి (Kaleshwaram Mukteshwara Swamy) వారిని దర్శించుకున్నారు. గత మూడు రోజులుగా భక్తుల రద్దీ అధికంగా ఉంది. సోమవారం చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.

    Saraswati Pushkaralu | భక్తుల ఇబ్బందులు

    సరస్వతి పుష్కరాల నిర్వహణపై భక్తులు (Devotees) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు సరిగ్గా లేవని భక్తులు పేర్కొంటున్నారు. సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) పుష్కరాలను ప్రారంభించారు. పనుల కోసం నిధులు కూడా మంజూరు చేశారు. మంత్రి శ్రీధర్​ బాబు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అయితే భక్తులకు సంఖ్యకు తగినట్లు సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారు.

    Saraswati Pushkaralu | నిత్యం ట్రాఫిక్​ జామ్​

    సరస్వతి పుష్కరాల్లో పోలీసుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా.. ట్రాఫిక్​ నియంత్రణకు పోలీసులు(Kaleshwaram Police) సరైన చర్యలు చేపట్టలేదు. దీంతో నిత్యం ట్రాఫిక్​ జామ్​ అయింది. ఒక రోజు ఏడు కిలోమీటర్ల మేర, మరో 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    దీంతో భక్తులు గంటల తరబడి వాహనాల్లో ఇబ్బందులు పడ్డారు. అయితే సోమవారం ట్రాఫిక్​ ఇబ్బందులు (Traffic problems) తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరి రోజు కావడంతో సోమవారం ఆలయంలో చండీ హోమం నిర్వహిస్తున్నారు. అలాగే సాయంత్రం 7 గంటలకు సప్త హారతులు కార్యక్రమం చేపడుతారు. తదనంతరం సరస్వతి పుష్కరాలు ముగుస్తాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...