అక్షరటుడే, హైదరాబాద్: Sannavadlu bonus : వానాకాలం సీజన్లో సన్న వడ్లు పండించిన కర్షకులకు అందించాల్సిన బోనస్ బకాయిలను తెలంగాణ సర్కారు తాజాగా విడుదల చేసింది. పెండింగులో ఉన్న రూ.514.36 కోట్ల నిధులను రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సన్న రకం వడ్లు సాగు చేసే కర్షకులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.17 లక్షల మంది రైతులకు సర్కారు హామీ ఇచ్చిన విధంగా జమ కానున్నాయి. ఇప్పటివరకు రైతులకు ప్రభుత్వం రూ.1,939.58 కోట్ల బోనస్‌ను చెల్లించడం గమనార్హం.
Sannavadlu bonus : నేరుగా రైతుల ఖాతాల్లోకి బోనస్
రాష్ట్రంలో సన్న బియ్యం సాగును ప్రోత్సహించడం, కర్షకులకు మద్దతు ధర (MSP) కు అదనంగా ఆర్థిక ప్రోత్సాహం అందించడమే ఈ బోనస్ ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. బోనస్ డబ్బులు విడుదలైన నేపథ్యంలో అన్నదాతలు తమ బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను (PPC) కానీ, పౌరసరఫరాల శాఖ (Civil Supplies) అధికారులను కానీ సంప్రదించాలని సూచించారు.