139
అక్షరటుడే, బోధన్: Indur Primary School | పట్టణంలోని ఇందూర్ ప్రైమరీ స్కూల్లో (Indur Primary School) ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డీటీవో ఉమామహేశ్వరరావు (DTO Umamaheswara Rao) పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
Indur Primary School | సంస్కృతి సంప్రదాయాలను మరవొద్దు..
ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోవద్దని డీటీవో విద్యార్థులకు సూచించారు. సంక్రాంతి పండుగను (Sankranthi festival) చిన్నారుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్కూల్ యాజమాన్యం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్లెటూరు సెట్టింగ్‌ను చూసి సంబురపడ్డారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఆర్టీవో శ్రీనివాస్, సీఐ వెంకట్, నారాయణ పాఠశాల కరస్పాండెంట్ కోడాలి కిషోర్, బోధన్ ట్రస్మా అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
