అక్షరటుడే, హైదరాబాద్: Sankranthi toll Free | ప్రభుత్వ పథకాలకు, సర్కారు ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు ఖాళీ జేబులు చూపుతున్న రేవంత్ సర్కారు.. ఆంధ్ర వాహనాలకు సంక్రాంతి కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనాలకు టోల్ గేట్ వద్ద ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని ఇవ్వబోతోంది. సంక్రాంతికి ఆంధ్రకు వెళ్లే వాహనాలకు టోల్ చార్జీలను భరిస్తామని రేవంత్ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది.
Sankranthi toll Free | హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే..
జనవరి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు (panthangi toll plaza) టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, NHAIకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. దీనికితోడు జనవరి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చే వాహనాలకు కూడా టోల్ మినహాయింపు ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కేంద్రం మినహిస్తే.. రోజుకు రూ. 5 కోట్ల చొప్పున రూ. 40 కోట్ల భారం తెలంగాణ ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ఓటర్లకు గాలం వేసేందుకు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది.