అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Sankatahara Chaturthi | సంకటహర చతుర్థి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గణనాథుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు.
ముఖ్యంగా మంగళవారం రోజు వచ్చే సంకటహర చతథ్థిని అంగారక సంకటహర చతుర్థి అని వేదపండితులు సూచిస్తుంటారు. దీంతో ఉదయాన్నే భక్తులు పలు గణేష్ ఆలయాల్లో అభిషేకాలు చేశారు. నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం(NTR statue) వద్ద ఉన్న గణేష్ మందిర్లో (Ganesh mandir) ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు.
Sankatahara Chaturthi | సాయంత్రం అన్నదానం..
ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న గణేష్ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసులు ట్రాఫిక్కు (Traffic) ఇబ్బందికాకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అన్నదానం కూడా చేస్తున్నారు.
నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గణేష్ మందిర్ వద్ద భక్తుల క్యూ