ePaper
More
    Homeభక్తిSankashti Chaturthi | విఘ్నాలను దూరంచేసే సంకష్టహర చతుర్థి.. పూజా విధానం, వ్రత కథ తెలుసుకుందామా..

    Sankashti Chaturthi | విఘ్నాలను దూరంచేసే సంకష్టహర చతుర్థి.. పూజా విధానం, వ్రత కథ తెలుసుకుందామా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Sankashti Chaturthi | విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చతుర్థి. ప్రతిమాసం కృష్ణ పక్షం(Krishna Paksha)లో.. అంటే పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా భావిస్తారు. ప్రదోషకాల సమయం( సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితి(Sankashti Chaturthi)గా పరిగణిస్తారు. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం అరుదుగా జరుగుతుంది. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండో రోజున సంకటహర చవితిగా జరుపుకుంటారు.

    Sankashti Chaturthi | కష్టాల నుంచి గట్టెక్కించేది..

    సంకష్టహర చతుర్థి అంటే కష్టాల నుంచి గట్టెక్కించేది అని అర్థం. ఈ రోజున విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి(Lord Vinayaka)ని పూజించడం ద్వారా స్వామివారి అనుగ్రహం సిద్ధిస్తుందని, జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని, ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయన్నది భక్తులు(Devotees) నమ్ముతారు.

    Sankashti Chaturthi | వ్రత కథ..

    పూర్వం ఒకానొక సమయంలో దేవరాజు అయిన ఇంద్రుడు(Indra) వినాయకుడికి గొప్ప భక్తుడైన బృఘండి అనే ఋషిని దర్శించుకుని స్వర్గానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఒక ప్రదేశానికి రాగానే ఆయన వాహనం ఆగిపోయింది. ఆ వాహనం వెలుగులకు ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు(Surasena) బయటికి వచ్చి ఇంద్రుడిని చూసి ఆనందపరవశుడయ్యాడు. అక్కడ వాహనం ఆగిపోవడానికి గల కారణాలను అడగ్గా.. సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గమధ్యలో ఆగిపోయిందని ఇంద్రుడు సమాధానమిచ్చాడు.

    READ ALSO  Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    అప్పుడు ఆ రాజు ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడుగ్గా.. ఇంద్రుడు ఇవాళ పంచమి(Panchami), నిన్న చతుర్థి. చతుర్థి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో, వారి పుణ్యఫలాన్ని తనకిస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా వెతుకుతారు. కానీ అలాంటివారు ఒక్కరూ దొరకరు. ఆ సమయంలో వారికి గణేశ ధూత ఒకరు స్త్రీ మృతదేహాన్ని భుజంపై మోసుకొని గణేశ లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది. ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. దానికి గణేశ ధూత, నిన్నంతా ఈ స్త్రీ తెలిసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది.

    READ ALSO  Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

    చంద్రోదయం(Moon rise) తర్వాతే భోజనం చేసింది. ఇందు వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కింది. ఈమె ఈ రోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకెళ్తున్నామని గణేశ ధూత చెబుతాడు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్రుడి వాహనం తిరిగి బయలుదేరుతుందని అడుగ్గా.. గణేశ ధూత ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి అంగీకరించడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా ఇంద్ర విమానం బయలుదేరుతుంది. దీనిని సంకష్టహర చతుర్థి వ్రత మహిమగా అందరూ భావించారు. అప్పటినుంచి ఈ ‍వ్రతాన్ని ఆచరిస్తున్నారు.

    Sankashti Chaturthi | ఏం చేయాలంటే..

    సంకష్టహర చతుర్థి (Sankashti Chaturthi) రోజున సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి స్వామికి దీపారాధన చేయాలి. అప్పటి వరకు ఉడికించినవి ఏవీ తినకూడదు. వీలైతే పూర్తి ఉపవాసం ఉండాలి. శక్తిలేనివారు పాలు, పండ్లు, పచ్చి కూరగాయలు తినవచ్చు. దీపారాధన తర్వాత సంకట నాశన గణపతి స్తోత్రం(Ganesha stotram) పఠించాలి. స్వామివారికి ఇష్టమైన దానిమ్మ, గన్నేరు సమర్పించాలి. ప్రసాదంగా పరమాన్నం, కుడుములు అందించాలి. ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్రదర్శనం చేసుకోవాలి. చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. శిరస్సున అక్షింతలు చల్లుకోవాలి.

    READ ALSO  Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం ద్వారా శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. సాధారణంగా ఈ వ్రతాన్ని ఎవరి వీలును బట్టి వారు 3, 5, 21 నెలలు ఆచరిస్తారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...