Homeక్రీడలుIPL 2026 | ఐపీఎల్ 2026 ట్రేడ్ పూర్తి.. సీఎస్కేకు జడేజా గుడ్‌బై, రాజస్థాన్‌కు బై...

IPL 2026 | ఐపీఎల్ 2026 ట్రేడ్ పూర్తి.. సీఎస్కేకు జడేజా గుడ్‌బై, రాజస్థాన్‌కు బై చెప్పిన సంజు శాంసన్

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్ల‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక ట్రేడ్ డీల్స్ అధికారికంగా పూర్తయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ సీఎస్కే జట్టుకు మారగా, సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో మెర‌వ‌నున్నాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) అభిమానులు ఊపిరి బిగపట్టేలా చూసిన సంజు శాంసన్ – రవీంద్ర జడేజా (Sanju Samson – Ravindra Jadeja) మెగా ట్రేడ్ ఎట్టకేలకు పూర్తయింది.

చాలా రోజులుగా దీనిపై అనేక ఊహాగానాలు తలెత్త‌గా, ఈ బిగ్గెస్ట్ స్వాప్ డీల్‌ను (biggest swap deal) ఐపీఎల్ అధికారికంగా ధృవీకరించింది. దీంతో చిన్న తలా జడేజా ఇకపై సీఎస్కే పసుపు జెర్సీలో కనిపించడు, అలాగే రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కెప్టెన్ సంజు శాంసన్ పింక్ జెర్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ మహా ట్రేడ్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ గడువు రోజునే పూర్తికావడం ప్రత్యేకత.

IPL 2026 | భారీ మార్పుల‌తో..

జడేజా- శాంసన్ స్వాప్ డీల్‌లో పారితోషిక మార్పులు జ‌రిగినట్టు స‌మాచారం. వేతన పరంగా కూడా ఈ మార్పు ఆసక్తికరంగా మారింది. సీఎస్కే గత సీజన్‌లో జడేజాను ₹18 కోట్లకు రిటైన్ చేసుకోగా, రాజస్థాన్ మాత్రం అతడికి ₹14 కోట్లు మాత్రమే చెల్లించనుంది. మరోవైపు, శాంసన్ తనపాత ఫీజుతోనే(₹18 కోట్ల) సీఎస్కేకు మారాడు. 177 మ్యాచ్‌లు ఆడిన సంజు శాంసన్ 2022లో రాయల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌గాను గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతని నాయకత్వం సీఎస్కేలో ఎలా పనిచేస్తుందో అన్న అంచనాలు జోరుగా ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మిగతా ఫ్రాంచైజీలు కూడా తమ బృందాల్లో కీలక మార్పులు చేశాయి.

ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) గత రెండు సీజన్లుగా ప్రాతినిధ్యం వహించిన అర్జున్ టెండుల్కర్‌ను ఎల్ఎస్జీ తమ జట్టులోకి తీసుకుంది.అలానే సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పుడు రిషభ్ పంత్ (Rishabh Pant) కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బౌలింగ్ చేయనున్నాడు. కోల్కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే మళ్లీ ముంబై ఇండియన్స్‌లో చేరాడు.

రాయల్స్‌కు విలువైన ఆల్‌రౌండర్‌గా ఉన్న నితీష్ రాణాను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్‌లో పొందింది. 64 ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం కలిగిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్, పంజాబ్ కింగ్స్ – సీఎస్కే తరఫున గతంలో మెరుపులు మెరిపించాడు. ఇక‌ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌లో చేరాడు. ₹2.4 కోట్ల ఫీజుతోనే ఆ డీల్ పూర్తయింది. ఈ భారీ ట్రేడ్లతో అన్ని జట్లు తమ కాంబినేషన్లను పూర్తిగా మార్చుకున్నాయి. సూపర్ స్టార్ ప్లేయర్ల విష‌యంలో జ‌రిగిన మార్పులు 2026 సీజన్‌ని మ‌రింత థ్రిల్ చేయ‌నున్నాయి.

Must Read
Related News