అక్షరటుడే, వెబ్‌డెస్క్: sanju samson century : వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 Asia Cup 2025 కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది.
ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుండటంతో, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టు ప్రకటన తర్వాత, టీమిండియా ఓపెనింగ్ జోడీపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ మధ్య ఓపెనర్ స్థానానికి గట్టి పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ తన బ్యాటుతో మెరుపులు మెరిపిస్తూ, గిల్‌కు బలమైన సందేశం పంపించాడు. కేరళ క్రికెట్ లీగ్ 2025లో కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఆడుతున్న సంజూ శాంసన్.. ఆదివారం కొల్లం సెయిలర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో సునామి ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన సంజూ, కేవలం 42 బంతుల్లోనే శతకం సాధించాడు.
sanju samson century : సునామి ఇన్నింగ్స్..
సంజూ శాంసన్ Sanju Samson 51 బంతుల్లో 121 పరుగులు చేయగా, ఇందులో 13 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. తొలి 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, మరో 26 బంతుల్లో పూర్తి సెంచరీ చేశాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన సంజూ, ఆసియా కప్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా,..లేదా అన్నది చూడాలి.
ఇక జట్టులో వైస్ కెప్టెన్‌గా గిల్ ఎంపికైనప్పటికీ, ఓపెనింగ్‌కు సంజూ వర్సెస్ గిల్ పోటీ తీవ్రంగా మారింది. అభిషేక్ శర్మతో పాటు గిల్ ఓపెనర్లు కావొచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే సంజూ శాంసన్ తాజా ఇన్నింగ్స్‌తో ఆ స్థానం కోసం ఇద్దరు గట్టిగా పోరాడుతున్నారు.
తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, కొల్లం సెల్లర్స్ 20 ఓవర్లలో 236 పరుగులు చేసి ఘన లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే సంజూ శాంసన్ అద్భుత బ్యాటింగ్‌తో కొచ్చి బ్లూ టైగర్స్ విజయాన్ని సాధించింది.
ఛేజింగ్‌లో అతని ఇన్నింగ్స్‌ను అభిమానులు “టీ20 చరిత్రలోని బిగ్గెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటి”గా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో మరో హైలైట్ ఏమిటంటే.. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా.. ఆశిక్ సిక్స్ కొట్టి తమ జట్టుని గెలిపించాడు.
దీంతో కొచ్చి బ్లూ టైగర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సంజూ ఇన్నింగ్స్ తర్వాత ఆసియా కప్ లో గిల్ ఓపెనర్‌గా Opener ఉంటాడా? లేక సంజూను ఆ స్థానంలోకి తీసుకుంటారా? అన్నది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.