అక్షరటుడే, ఇందూరు: BDSF | బహుజన డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (Bahujan Democratic Student Federation) జిల్లా కన్వీనర్‌గా తలారి సంజయ్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు సాయి కృష్ణ తెలిపారు.
బోధన్‌కు (Bodhan) చెందిన సంజయ్ వామపక్ష విద్యార్థి ఉద్యమాల ద్వారా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. బీడీఎస్ఎఫ్ బలోపేతానికి, విద్యార్థుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.