అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | పట్టణంలోని నూతన బస్టాండ్ (new bus stand) నుంచి బస్సుల రాకపోకలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్టాండ్ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. బుధవారం బస్టాండ్ ఆవరణలో బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. అలాగే భూమిని చదును చేశారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ (Municipal Commissioner Gopu Gangadhar) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బస్టాండ్ ప్రాంతంలో ఎక్కడా వ్యర్థాలు లేకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. రాత్రి సమయంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయించారు. అదేవిధంగా, రోడ్డు డివైడర్ల వెంబడి పేరుకుపోయిన మట్టిని తొలగించి ఎప్పటికప్పుడు రహదారులను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. బస్టాండ్ పునరుద్ధరణ జరిగినందున పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.