ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Ganesh Immersion | నిమజ్జనంలో అపశృతి.. వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలి మృతి

    Ganesh Immersion | నిమజ్జనంలో అపశృతి.. వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వినాయక నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి విగ్రహాలను భక్తులు చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు.

    నగరంలోని 20 చెరువులు, కృత్రిమ కొలనుల్లో విగ్రహాల నిమజ్జనం చేపడుతున్నారు. లక్షలాది విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం ఉదయం వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా రోడ్డుపై పేరుకుపోయిన చెత్త తొలగిస్తున్న పారిశుధ్య కార్మికులిని టస్కర్​ వాహనం ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

    వినాయక నిమజ్జనం కోసం వచ్చిన టస్కర్​ వాహనం ఢీకొనడంతో పారిశుధ్య కార్మికురాలు రేణుక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బషీర్‌బాగ్‌-లిబర్టీ మార్గంలో జీహెచ్​ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వాహనం డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

    Ganesh Immersion | కొనసాగుతున్న నిమజ్జనం

    హైదరాబాద్ నగరంలో నిమజ్జనం కొనసాగుతోంది. నగరవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.60 లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. హుస్సేన్​ సాగర్​ (Hussain Sagar) వద్ద భారీ సంఖ్యలో గణనాథులు బారులు తీరాయి. దీంతో ఆదివారం రాత్రి వరకు నిమజ్జనం సాగే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు విగ్రహాల వ్యర్థాలను వెంటవెంటనే తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 11 వేట టన్నుల వ్యర్థాలు తొలగించి జవహర్​ నగర్​లోని ప్రాసెసింగ్​ సెంటర్​కు తరలించారు.

    More like this

    Transport Department | రవాణా శాఖ చెక్​పోస్టుల ఎత్తివేత.. ఉమ్మడి జిల్లాలో మూడింటిని తొలగిస్తూ నిర్ణయం

    అక్షరటుడే, ఇందూరు : Transport Department | రవాణా శాఖ చెక్​పోస్టుల్లో అవినీతి గురించి అందరికి తెలిసిందే. అధికారులు...

    CP Sai Chaitanya | గణేశ్​ ఉత్సవాలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు : సీపీ సాయి చైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్​ పరిధిలో గణేశ్​...

    PCC Chief | పీసీసీ చీఫ్​ను సన్మానించిన కాంగ్రెస్​ నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: PCC Chief | పీసీసీ చీఫ్​గా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బొమ్మ మహేశ్​కుమార్​...