అక్షరటుడే, కామారెడ్డి: Sandeepani College Annual Day | కామారెడ్డి పట్టణంలోని (Kamareddy) సాందీపని జూనియర్ కళాశాల 25వ వార్షికోత్సవాన్ని (Annual Day Celebration) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, ప్రముఖ సినీనటుడు, మోటివేషనల్ స్పీకర్ కేవీ ప్రదీప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.
Sandeepani College Annual Day | ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవాలి..
ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి ప్రయత్నించాలని, భిన్నంగా ఆలోచించి ఆచరణలో పెట్టి విజయం సాధించాలని పైడి ఎల్లారెడ్డి సూచించారు. పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంలో సమయం వృథా చేసుకోకుండా చదువుకోవాలని (Kamareddy DIEO) జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు నైపుణ్యాలను (Student Performances) సంపాదిస్తే ఏ రంగంలోనైనా మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు జనార్దన్, రెడ్డి, పెంటయ్య, అశోక్ రావు, హరిస్మరణ్ రెడ్డి, బాలాజీ రావు, రాజేశ్వరరావు, ప్రిన్సిపాల్స్, ఉపన్యాసకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.