HomeUncategorizedSandeep Reddy Vanga | అర్ధ‌రాత్రి దీపిక‌ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగిన సందీప్ రెడ్డి...

Sandeep Reddy Vanga | అర్ధ‌రాత్రి దీపిక‌ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగిన సందీప్ రెడ్డి వంగా.. ఏమైంది..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Sandeep Reddy Vanga | ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌(Spirit) అనే సినిమాని తెరకెక్కించబోతున్న విష‌యం తెలిసిందే. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్‌ ఎంపిక జరుగుతుంది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెని (Deepika padukone) ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అనూహ్యంగా ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుంది. అయితే సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయని, ఆ విషయంలో దీపికా అభ్యంతరం తెలిపిందని సమాచారం. అంతేకాదు కొన్ని రూల్స్ కూడా పెట్టిందట. ఈ నేపథ్యంలో ఇద్దరికి సెట్‌ కాలేదని, దీంతో ఈ మూవీ నుంచి దీపికా తప్పుకుందని తెలియ‌డంతో ఆమె స్థానంలో యానిమల్‌ నటి త్రిప్తి డిమ్రీ(Heroine Tripti Dimri)ని హీరోయిన్‌గా ఎంచుకున్నారు సందీప్‌.

Sandeep Reddy Vanga | ఏం జరుగుతుంది..

‘స్పిరిట్’ ఇంకా మొదలు కాకముందే బాలీవుడ్ Bollywood అతణ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. బాలీవుడ్ మీడియాలో వరుసగా సందీప్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు మొదలయ్యాయి. ‘ఎ’ రేటెడ్ సీన్లు ఉండడం వల్ల దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ, సందీప్ అన్ ప్రొఫెషనల్ అని.. ఇలాంటి స్టోరీస్ వస్తున్నాయి. ఐతే సందీప్ ఇలాంటి వాటికి బెదిరే రకం కాదు. ఊరుకునే రకం కూడా కాదు. పీఆర్ స్టంట్స్ మొదలుపెట్టిన దీపికకు గట్టిగా కౌంటర్ ఇచ్చేశాడు. సోమవారం అర్ధరాత్రి వేళ ‘ఎక్స్’ ద్వారా దీపిక పేరు ఎత్తకుండానే ఆమె మీద బాంబు వేశాడు సందీప్.

సందీప్‌ రెడ్డి ట్విట్టర్‌(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆయన చెబుతూ, తాను ఒక ఆర్టిస్ట్ కి కథ చెప్పానంటే అది పూర్తి నమ్మకంతోనే చేస్తాను. కానీ ఆ కథను బయటపెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారని అన్నాడు. నా కథని బహిర్గతం చేయడమే కాకుండా ఒక యంగ్‌ యాక్టర్‌(Young Actor)ని కూడా తక్కువ చేశారు. ఇదేనా మీ ఫెమినిజం?. ఒక సినిమా కోసం ఏళ్లుగా కష్టపడతాం. ఫిల్మ్ మేకింగే నాకు అన్నీ. అది ఆ వ్యక్తికి అర్థం కాదు. అర్థం చేసుకోలేరు, ఎప్పటికీ అర్థం కాదు` అంటూ ఫైర్‌ అయ్యారు సందీప్‌ రెడ్డి వంగా Sandeep reddy vanga. తన దైన స్టయిల్‌లో హిందీలో డైలాగ్‌ని పంచుకుంటూ డర్టీపీఆర్ గేమ్స్ అంటూ యాష్‌ ట్యాగ్‌ని కూడా మెన్షన్‌ చేశారు. దీంతో సందీప్ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది .

Must Read
Related News