HomeUncategorized Sandeep Reddy Vanga | వరద బాధితులకు ఆర్థికసాయం చేసిన ప్రముఖ డైరెక్టర్.. మిగితా సినీనటులు...

 Sandeep Reddy Vanga | వరద బాధితులకు ఆర్థికసాయం చేసిన ప్రముఖ డైరెక్టర్.. మిగితా సినీనటులు స్పందిస్తారా..?​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sandeep Reddy Vanga | ప్ర‌స్తుతం తెలంగాణ‌(Telangana)లో వర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. వ‌ర్షాల వ‌ల‌న ఎంద‌రో నిరాశ్ర‌యులు అయ్యారు. అయితే తెలంగాణ ప్ర‌జ‌ల ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ రోజు రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని క‌లిసి ఏకంగా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లని విరాళంగా అందించారు. భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల చెక్‌ని సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), ప్రణయ్ రెడ్డి వంగాలు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి అందించారు. అయితే గ‌తంలో ఏపీలో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు టాలీవుడ్ వెంట‌నే స్పందిస్తూ విరాళాలు అందించింది. ఇప్పుడు కామారెడ్డి(Kamareddy), మెద‌క్‌(Medak)లో విధ్వంసం జ‌ర‌గ‌గా ఇంతవ‌ర‌కు ఎవ‌రు స్పందించి లేదు. దీనిపై నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాకి ఉన్న ఆలోచ‌న మిగ‌తా వాళ్ల‌కి లేదేంటని కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు.

 Sandeep Reddy Vanga | సందీప్ సాయం..

కాగా, సందీప్ రెడ్డి వంగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలు వ‌రుస హిట్స్ అవుతూ ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా యానిమ‌ల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఒక విమానంలో కూడా రొమాన్స్ చేయొచ్చా? చేస్తే అది ఎలా ఉంటుందో చాలా ఆస‌క్తిక‌రంగా చూపించాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న ఆ పాత్రలకు కూడా పూర్తి న్యాయం చేయ‌డంతో సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాలో తృప్తి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవ‌ల స్పిరిట్ సినిమాలో ఒక ప్రతిష్టాత్మకమైన పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ చిరంజీవిని అప్రోచ్ అయినట్టు వార్త‌లు వ‌చ్చాయి.. ఆల్మోస్ట్ చిరంజీవి కూడా ఓకే చెప్పాడ‌ని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ప్ర‌చారం జ‌రిగింది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ప్రభాస్ క్యారెక్టర్ కంటే హైలైట్‌గా నిలిచేలా ఉండబోతోందని అన‌డంతో మెగా ఫ్యాన్స్ ఆనందం అవ‌ధులు దాటింది. చిరంజీవి అంటే సందీప్ రెడ్డి వంగా కి చిన్ననాటి నుండి విపరీతమైన అభిమానం. ఆయనతో సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తుండ‌గా, ఇప్పుడు ఈ సినిమాతో ఆ కొర‌త తీర్చుకోబోతున్నాడ‌ని అంటున్నారు