ePaper
More
    HomeతెలంగాణPrincipal Secretary | ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్​కుమార్​ సుల్తానీయా

    Principal Secretary | ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్​కుమార్​ సుల్తానీయా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Principal Secretary | ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్​ ఐఏఎస్ senior ias​ అధికారి సందీప్​కుమార్​ సుల్తానీయా sanddep kumar sultania నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు CS Ramakrishnarao ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ Telangana రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు పని చేశారు. అయితే ఇటీవల సీఎస్​ శాంతికుమారి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం రామకృష్ణారావును సీఎస్​గా నియమించిన విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో సందీప్​కుమార్​ను తాజాగా నియమించారు. ఆయన మంగళవారం సాయంత్రం లేదంటే బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాగా సందీప్​ కుమార్​ సుల్తానియా ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ finance department లో కార్యదర్శిగా పనిచేశారు. సీనియర్​ కావడంతో పాటు ఆర్థికశాఖలో గతంలో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకు ముఖ్య కార్యదర్శి పదవి అప్పగించారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...