Homeజిల్లాలునిజామాబాద్​SI sandeep | భీమ్​గల్​ ఎస్సైగా సందీప్

SI sandeep | భీమ్​గల్​ ఎస్సైగా సందీప్

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: SI sandeep | భీమ్​గల్​ ఎస్సైగా (Bheemgal SI) సందీప్​ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం భీమ్​గల్ పోలీస్​ స్టేషన్ (Bheemgal Police station)​ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన మహేష్​ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నిజామాబాద్​ ఎస్​బీలో పనిచేస్తున్న సందీప్​ ట్రాన్స్​ఫర్​పై భీమ్​గల్​కు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భీమ్​గల్​ సీఐ పొన్నం సత్యనారాయణను (Bheemgal CI Ponnam satyanarayana) మర్యాదపూర్వకంగా కలిశారు. సందీప్​ గతంలో నిజామాబాద్​ నగరంలోని నాలుగో టౌన్​లో పనిచేశారు. అనంతరం ఎన్నికల సమయంలో నిర్మల్ (Nirmal)​ జిల్లాకు బదిలీపై వెళ్లారు. అనంతరం నిజామాబాద్​ ఎస్​బీకి రాగా.. తాజాగా భీమ్​గల్​ ఎస్సైగా నియమితులయ్యారు.

SI sandeep | శాంతిభద్రతల పరిరక్షణకు కృషి

భీమ్​గల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై సందీప్​ తెలిపారు. సిబ్బంది, ప్రజల సహకారంతో ముందుకు సాగుతామన్నారు. గంజాయి, దొంగతనాల నివారణకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని సూచించారు.