5
అక్షరటుడే, బాల్కొండ : Balkonda | ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్సై శైలేందర్ (Sub-Inspector Shailender) తెలిపారు.
శెట్టిపల్లి గ్రామానికి చెందిన బాబ్బురి నరేశ్, గురిజాల నర్సయ్య అక్రమ ఇసుక రవాణాలో పాల్గొన్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.