అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal | అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకంలో కూలీలతో తొలగింపచేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్(MPDO Santosh Kumar) అన్నారు.
మండల పరిషత్ కార్యాలయం(Mandal Parishad Office)లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మండలంలో చేపట్టాల్సిన పనుల గురించి మండల వ్యవసాయ అధికారి లావణ్య, ఉపాధిహామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.మండలంలో 124 మంది రైతుల భూముల్లో సుమారు 85 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని వ్యవసాయ అధికారుల నివేదిక ఇచ్చారన్నారు. ఉపాధి హామీ పథకంలో వెంటనే అంచనాలు తయారు చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది ఉమ్మడి సర్వే చేసి వాస్తవ స్థితిగతులను నివేదిక ఇవ్వాలన్నారు.
రైతుల(Farmers) నుంచి అంగీకారం తీసుకొని పనులు ప్రారంభించాలని, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ ఏపీవో నర్సయ్య, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్, ఉపాధి హామీ సాంకేతిక సహాయకులు తదితరులు పాల్గొన్నారు.