అక్షరటుడే, ఇందూరు: MP Arvind | జిల్లాలో మూడు ఆర్వోబీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని ఎంపీ అర్వింద్ (MP Arvind) కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కను (Finance Minister Bhatti Vikramarka) హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో ఎంపీ బుధవారం కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్వోబీలకు సంబంధించిన బిల్లులు కొన్నినెలలుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

