HomeసినిమాSamyuktha Menon | సంయుక్త మీనన్ దూకుడు మాములుగా లేదు.. ‘ది బ్లాక్ గోల్డ్’తో మరో...

Samyuktha Menon | సంయుక్త మీనన్ దూకుడు మాములుగా లేదు.. ‘ది బ్లాక్ గోల్డ్’తో మరో సెన్సేషనల్ రోల్

‘భీమ్లా నాయక్’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంయుక్త మీనన్, ‘బింబిసార’, ‘విరూపాక్ష’ వంటి విజయవంతమైన చిత్రాలతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సంయుక్త మీనన్ ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samyuktha Menon | ‘భీమ్లా నాయక్’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ‘బింబిసార’, ‘విరూపాక్ష’ వంటి హిట్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందగత్తె ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తోంది.

‘చింతకాయల రవి’ ఫేమ్ యోగేష్ కేఎంసీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్‌కు ‘ది బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్‌ను దీపావళి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తుండగా, సింధు మాగంటి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ (Hyderabad)లో శరవేగంగా సాగుతోంది.

Samyuktha Menon | చేతిలో ఎనిమిది సినిమాలు!

ఈ చిత్రంలో సంయుక్త (Samyuktha Menon) యాక్షన్‌తో నిండిన డైనమిక్ పాత్రలో కనిపించబోతుందని, చాలా సీన్లను ఆమె స్వయంగా చేయబోతున్నారని మేకర్స్ వెల్లడించారు. థ్రిల్లర్, ఎమోషన్, సస్పెన్స్ మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నట్టు దర్శకుడు యోగేష్ (Director Yogesh) తెలిపారు. సంయుక్త మీనన్ కెరీర్ ఇప్పుడు టాప్ గేర్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా 8 ప్రాజెక్టులు ఉన్నాయి.

  • ‘అఖండ 2’ – బాలకృష్ణ సరసన
  • విజయ్ సేతుపతి – పూరీ జగన్నాథ్ కాంబోలో కొత్త చిత్రం
  • ‘నారీ నారీ నడుమ మురారీ’ – శర్వానంద్‌తో
  • ‘హైందవ’ – బెల్లంకొండ శ్రీనివాస్‌తో
  • ‘స్వయంభు’ – నిఖిల్‌తో
  • ‘బెంజ్’ – లారెన్స్‌తో
  • ‘మహారాణి’ – హిందీ చిత్రం
  • అలాగే ‘ది బ్లాక్ గోల్డ్’ ఆమె సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న స్పెషల్ ప్రాజెక్ట్మలయాళంలో ‘పాప్‌కార్న్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త, తరువాత తమిళంలో ‘కలరి’, కన్నడలో ‘గాలిపట 2’, తెలుగులో ‘భీమ్లా నాయక్’తో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఆమె లైనప్ చూస్తుంటే, సౌత్‌లో టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా ఎదగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. “ది బ్లాక్ గోల్డ్” తో సంయుక్త మరోసారి తన నటనా ప్రతిభను, యాక్షన్ స్కిల్స్‌ను రుజువు చేయబోతుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.