42
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Samsung F70e 5G | దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల (Smart Phones) తయారీ కంపెనీ అయిన శాంసంగ్.. బడ్జెట్ సెగ్మెంట్లో మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, బిగ్ బ్యాటరీ, లెదర్ ఫినిష్ ప్యానెల్‌తో ఎఫ్70ఈ పేరిట తీసుకువచ్చిన ఈ ఫోన్ సేల్ ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుంది. బడ్జెట్ ధరలో తీసుకువచ్చిన ఈ ఫోన్‌కు ఏకంగా ఆరేళ్ల వరకు ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్ (Security Updates) అందించనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
- 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. డిజైన్ పరంగానూ ఈ ఫోన్ ఆకట్టుకొనేలా ఉంది.
- ఈ స్మార్ట్‌ఫోన్ 8.2 ఎంఎం థిక్‌నెస్‌తో 199 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ ప్రీమియం లెదర్ ఫినిష్ను కలిగి ఉంటుంది.
- ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు.
- ఆండ్రాయిడ్ 16తో కూడిన వన్ యూఐ 8 తో పనిచేస్తుంది.
- 6.23 లక్షల పాయింట్ల అంటుటు స్కోర్ కలిగి ఉంది.
- ఈ ఫోన్‌కు ఆరేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
- వెనకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో తీసుకువచ్చారు. 25డబ్ల్యూ వైర్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
- బ్లూ, లైమ్లైట్ గ్రీన్ కలర్స్‌లో, రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. 4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.12,999. 6జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ.14,999.
- ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులతో వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది.
- ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తోపాటు అదనంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.